ఫైట్ లో స్టార్ హీరోయిన్ ముక్కు తెగింది!

టాలీవుడ్ దర్శకుడు క్రిష్ డైరెక్షన్ లో బాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న మూవీ ‘మణికర్ణిక – ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ’. వీరనారిగా చరిత్రలో నిలిచిన ఝాన్సీ లక్ష్మీభాయ్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో టైటిల్ రోల్ ను డేరింగ్ అండ్ డాషింగ్ హీరోయిన్ కంగనా రనౌత్ పోషిస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ లో కంగనా గాయపడటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

షూటింగ్ లో భాగంగా కత్తి సాము చేస్తున్నప్పుడు ప్రమాదవశాత్తూ కత్తి తగిలి కంగనా ముక్కు పైన నుదిటి భాగంలో పెద్ద గాటు పడింది. వెంటనే స్పందించిన చిత్ర యూనిట్ ఆమెను హాస్పటల్ కు తరలించారు. ఈ కత్తిగాటు వలన కంగనా ముఖానికి 15 కుట్టు పడినట్టు తెలుస్తోంది. ఆమెకు రెండు వారాల విశ్రాంతి అవసరమని వైద్యుల సూచించారట.

మరోవైపు ఈ సినిమాను కంగనా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటిస్తున్నట్టు బాలీవుడ్ వర్గాల భోగట్టా. అందుకే డూప్ లేకుండా ఫైట్స్ సీన్స్ లో తనే స్వయంగా నటిస్తున్నట్టు చెపుతున్నారు. ఈ సినిమా తర్వాత ఇక సినిమాల్లో నటించనని కంగనా రనౌత్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఝాన్సీ లక్ష్మీ భాయ్ పూర్తయ్యాక దర్శకత్వ శాఖలో కొనసాగుతానని ఆమె వెల్లడించింది.