డ్రగ్స్ కేసు :సిట్ నెక్ట్స్ లిస్ట్ లో అగ్రహీరో పేరు!!

టాలీవుడ్ ను ఒక్క కుదుపు కుదిపిన డ్రగ్స్ వ్యవహారంలో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నుంచి నోటీసులు అందుకున్న నటులు, దర్శకులు, ఇతర టెక్నీషియన్లను కాపాడేందుకు తెరవెనుక పెద్ద వ్యవహరం నడుస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ‌్యంగా నిన్నటి విచారణలో పూరీ జగన్నాథ్ ను కాపాడేందుకు ఒక అగ్రహీరో తీవ్రంగా ప్రయత్నించినట్టు వార్తలు వస్తున్నాయి.

ఎందుకంటే విచారణ మరింత ముందుకు వెళితే తన పేరు ఎక్కడ బయటపడుతుందోనన్న భయం ఆ హీరో వెంటాడుతోందట. గడిచిన 5 ఏళ్లలో చాలా తక్కువ సినిమాలు చేసినా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఆ హీరో డ్రగ్స్ కు బాగా బానిస అయ్యాడని చెప్పుకుంటున్నారు. రీసెంట్ గా అతని సినిమా ఆలస్యం కావడానికి కూడా అతిగా డ్రగ్స్ తీసుకోవడమే కారణమని తెలుస్తోంది.

సిట్ రెండో దఫా విడుదల చేసే లిస్ట్ లో ఇతని పేరు కచ్చితంగా ఉంటుందనే వార్తలు గుప్పుమంటున్నాయి. దీంతో రంగంలోకి దిగిన సదరు హీరో కేంద్ర ప్రభుత్వం స్థాయి నుంచి పైరవీలు మొదలుపెట్టాడట. తన పేరు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రాకుండా ప్రభుత్వాన్ని మేనేజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని కొందరు మాట్లాడుకుంటున్నారు.