అబ్బాయిలూ బీకేర్ ఫుల్..ఇలా కూడా ట్రాప్ చేస్తున్నారు!

ముళ్లు వచ్చి ఆకు మీద పడ్డా..ఆకు వెళ్లి ముళ్లు మీద పడ్డా ఆకుకే నష్టం అన్న సామెత వినే ఉంటారు. ఈ సామెతను ఆడవాళ్లు, మగవాళ్లు సంబంధాల కోసం వాడుతూ ఉంటారు. ఆడవాళ్లు మగవాళ్లతో జాగ్రత్తగా ఉండాలని చెప్పే సందర్భంలో ఈ సామెతను వాడుతారు. అయితే అది ఒకప్పుడు..ఇప్పుడు రోజులు మారిపోయాయి…జాగ్రత్తగా ఉండకపోతే మట్టికొట్టుకుపోయేది అబ్బాయిలే. చట్టాన్ని, వ్యవస్థలో పాతుకుపోయిన అనుకూలతను ఉపయోగించుకుని కొందరు కిలేడీలు రెచ్చిపోతున్నారు.

తాజాగా విజయనగరం జిల్లాలో ఒక ఘటన జరిగింది. అబ్బాయిని లవ్ చేస్తున్నానని చెప్పిన ఓ అమ్మాయి బరి తెగించి అతన్ని ప్రతీ రోజూ ఇంటికి తెచ్చుకుంటోంది. ఆ అభాగ్యుడు వెనుకా ముందూ చూడకుండా వయసు జోరులో ఇంటికి వస్తూ పోతూ ఆనందంలో విహరిస్తున్నాడు. కట్ చేస్తే వన్ ఫైన్ మార్నింగ్ మనోడు ఇంటిలో లవర్ తో రోమాన్స్ చేస్తుండగా బయట నుంచి తాళం వేసారు. ప్రియురాలి స్క్రీన్ ప్లే డైరెక్షన్ లో ఆమె అక్కా బావలు ఈ నాటకాన్ని నడిపించారు.

ఇంకేముంది ప్రతీ రోజూ ఇంటికొస్తున్నాడు. అన్నీ చేస్తున్నాడు. పెళ్లి చేసుకోవాల్సిందే. లేదంటే తాళం తీసేది లేదు. అని కథను రసవత్తరంగా నడిపించారు. అప్పుడు గుర్తొచ్చింది మనోడికి అడ్డంగా బుక్కయిపోయానని. ఇక పోలీసులు రంగ ప్రవేశం చేసి పెళ్లి చేసుకుంటానని అతనితో బలవంతంగా ఒప్పించి అప్పుడు తాళం తీసారు. సభ్యతా సంస్కారాలు మరిచి ఒక మగవాడ్ని ఇంటికి పిలిపించుకుని ఎంజాయ్ చేస్తున్న అమ్మాయి ఇక్కడ హీరోయిన్. ఆమెను ఒక వీరనారిగా అందరూ కొనియాడతారు.

అమ్మాయిలు లవ్ చేసి హ్యాండ్ ఇస్తే ఎటువంటి కేసులు ఉండవు. న్యాయం ఉండదు. ధర్మం ఉండదు. అదే అబ్బాయి లవ్ చేసి హ్యాండ్ ఇస్తే ఈ ప్రపంచం అతన్ని చంపి పాతరేస్తుంది. ఈ రెండు న్యాయాలు ఏంటో? అబ్బాయిలూ …కాస్త ఇలాంటి విషయాలను జాగ్రత్తగా గమనించండి. లవర్ పిలిచింది కదాని ఎగేసుకుని వెళ్లిపోకండి. ప్రస్తుత సమాజంలో ఆడవాళ్లకు అన్ని వైపుల నుంచి న్యాయం జరుగుతుంది. అన్యాయం అయిపోయేది మగవాడే. నీ గోడు వినే వాడు కూడా ఉండడు. బీ కేర్ ఫుల్. ఆకు వెళ్లి ముళ్లు మీద పడినా…ముళ్లు వెళ్లినా ఆకు మీద పడినా ఆకుకే రంధ్రం. జీవితం సంకనాకిపోతుంది. జాగ్రత్త.