ప్రియుడితో లేచిపోయిన భార్య..భర్త ఆత్మహత్య

దేశంలో పురుషుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా తమిళనాడు మరో అభాగ్యుడు, భార్యా బాధితుడు ఆత్మహత్య చేసుకుని తనువు చాలించాడు. చెన్నై లోని తాంబరం సమీపంలోని సంతోష్ పురం పార్కు స్ట్రీట్ కు చెందిన రాజన్ (31) ఒక ప్రయివేట్ స్కూల్లో బస్సు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఇతని భార్య పేరు సీతాలక్ష్మీ. వీరికి శృతి (6) , వినీష్ (5) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.

సీతాలక్ష్మీ అదే ప్రాంతంలో ఐవర్ రాజ్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తోంది. భర్త ఎన్నిసార్లు చెప్పినా తన సరదాల కోసం తన ఇల్లీగల్ కాంటాక్ట్ ను కొనసాగిస్తూ వస్తోంది. ఒక రోజు గట్టిగా మందలించడంతో చిన్న పిల్లలను నిర్ధాక్షిణ్యంగా వదిలిపెట్టి లవర్ తో వెళ్లిపోయింది. ఒకవైపు భార్య లేచిపోయిందని గేలి చేసే సమాజం, మరోవైపు తల్లి ఆలన లేక బిక్కుబిక్కుముంటున్న పిల్లలను చూడలేక రాజన్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

తన శారీరక సుఖాల కోసం లవర్ సిగ్గూ శరం లేకుండా సీతాలక్ష్మీ ని ఇప్పుడు చట్టం ఏ విధంగా శిక్షిస్తుందన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. మన దేశంలో చట్టాలు కేవలం పురుషులను శిక్షించేందుకే మాత్రమే ఉన్నాయి. ఆడవాళ్లు తప్పులు చేసినా దర్జాగా బయట తిరగొచ్చు. సీతా లక్ష్మీ చేసిన తప్పును రాజన్ చేసి ఉంటే ఆమె సూసైడ్ చేసుకుని ఉంటే పత్రికలు హోరెత్తిపోయేవి. మహిళా సంఘాలు గొంతులు చించుకునేవి.

కానీ రాజన్ లాంటి అర్ధంతరంగా ముగిసిన కన్నీటి కథలను ఏ పేపర్ లోనూ రాయరు. ఎవరూ మాట్లాడరు. ఎందుకంటే ఆడవాళ్లు తప్పులు చేసినా కరెక్టే. మగవాళ్లను శిక్షించేందుకు చట్టాల మీద చట్టాలు తయారు చేసే మన న్యాయ వ్యవస్థ ఇలాంటి దుర్మార్గపు ఆడవాళ్లను శిక్షించే చట్టాలు తయారు చేయదేం? రెండు రోజులు జైల్లో హాయిగా గడిపి సీతా లక్ష్మీ హాయిగా ప్రియుడితో ఎంజాయ్ చేస్తుంది. రాజన్ లాంటి మగవాళ్లు వేలాది మంది దేశవ్యాప్తంగా ఉసురు తీసుకుంటున్నారు. దీనికి ముగింపు లేదా? లింగ సమానత్వం కోసం గొంతు చించుకునే మేధావుల్లారా? ఇలాంటి ఘోరాలు జరిగినప్పుడైనా నోరు తెరవండి. లేదంటే ఈ దేశంలో ప్రజలు న్యాయవ్యవస్థ మీద నమ్మకం కోల్పోతారు.