తెల్లజుట్టు, బట్టతల ఎందుకొస్తాయో తెలుసా?

చాలా మంది మగవాళ్లకు చిన్న వయస్సులోనే జుత్తు నెరిసిపోవడం, జుత్తు రాలిపోయి బట్టతల రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. మగవాళ్లను మానసికంగా ఇబ్బందిపెడుతున్న ఈ మార్పుకు ఇన్నాళ్లు జన్యు సంబంధిత కారణాలే అని శాస్త్రవేత్తలు భావించారు. అయితే ఈ రెండు సమస్యలకు అసలు కారణమేంటో ఇటీవలే శాస్త్రవేత్తలు గుర్తించారు. కేఆర్‌ఓఎక్స్ 20 అనే ప్రోటీన్ జుట్టు పెరుగుదలకు కారణమైతే, అందులోని మూల కణకారకం (ఎస్‌సీఎఫ్) తో జుత్తుకు మంచి రంగు వస్తుందని సైంటిస్ట్ లు వెల్లడించారు.

కీలకమైన ఈ రెండూ ఉంటేనే జుత్తు నల్లగా నిగనిగలాడుతో మంచి ఒత్తుగా పెరుగుతుందని తేల్చారు. ఎలుకలపై ప్రయోగం చేసి దీన్ని శాస్త్రీయంగా నిర్ధారించినట్టు వెల్లడించారు. కాబట్టి తల్లిదండ్రుల నుంచి వచ్చిన జన్యువుల్లో ఈ రెండు కారకాలు జత్తు పెరుగుదలను, రంగు నిర్ణయిస్తాయని తేలింది.