ప్రతీ ఉద్యోగీ తెలుసుకోవాల్సిన కొత్త ఈపీఎఫ్ రూల్స్!

 

దేశంలో కరోనా వైరస్ ని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం దాదాపు 3 నెలల నుంచి లాక్‌డౌన్ ను కొనసాగిస్తూ వస్తోంది. కరోనా దెబ్బకు అన్ని రంగాలు కుదేలయ్యాయి. ముఖ్యంగా ఒకే ఆదాయంతో అంటే జీతాలతో కుటుంబాలను నెట్టుకొస్తున్న ఉద్యోగులు తీవ్రంగా ప్రభావితమయ్యారు. ఒకవైపు ఉద్యోగం పోతుందేమోనన్న భయానికి తోడు అరకొర జీతాలతో అభద్రతాభావానికి లోనైన ఉద్యోగులెందరో. ఈ క్రమంలో కరోనా ప్రభావిత రంగాలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ఆత్మ నిర్భర్ భారత్’ పేరుతో ఒక ప్రత్యేక ప్యాకేజీని తీసుకొచ్చారు. ఆ ప్యాకేజీలో భాగంగా ఉద్యోగులకు ఉపశమనం కల్పించేందుకు కొన్ని చర్యలు చేపట్టారు. ముఖ్యంగా ఈపీఎఫ్ వాటాను తగ్గించడం ద్వారా ఉద్యోగుల చేతికి మరింత ఎక్కువ మొత్తం అందేలా కొన్ని మార్పులు చేసారు. ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్ లో కేంద్ర ప్రభుత్వం చేసిన మార్పులు, ఉద్యోగులు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయాలను ఇప్పుడు చెప్పుకుందాం.

  • ఈపీఎఫ్‌& ఎమ్‌పీ యాక్ట్ 1952 ప్రకారం ఉద్యోగి బేసిస్ శాలరీ మరియు డీఏ పైన 12 శాతం వరకూ ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్ ఉండాలి. ఇప్పుడు ‘ఆత్మ నిర్భర్ భారత్’ ప్యాకేజీ ద్వారా ఆ మొత్తాన్ని 10 శాతానికి తగ్గించారు.

 

  • ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్ ను 12 నుంచి 10 శాతానికి తగ్గించడం వలన దేశవ్యాప్తంగా దాదాపు 4.3 కోట్ల మంది ఉద్యోగులు, 6.5 లక్షల సంస్థలు లబ్ది పొందనున్నాయి.

 

  • ఈపీఎఫ్ లో చేసిన ఈ కంట్రిబ్యూషన్ తగ్గింపు మే 2020 నుంచి జూలై 2020 వరకూ ఉంటుంది.

 

  • ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్ ను తగ్గించడం వలన ఉద్యోగి చేతికి అధిక మొత్తం అందుతుంది. అలాగే సంక్షోభంలో ఉన్న కంపెనీలు లబ్ది పొందుతాయి. ఉదాహరణకు 10000 బేసిక్ శాలరీ ఉన్న ఉద్యోగికి రూ.1200 ఈపీఎఫ్ డిడక్ట్ అయ్యేది. తాజా మార్పుతో అది రూ.1000 తగ్గింది. అలాగే ఎంప్లాయర్ కు కూడా తన వంతు చెల్లించాల్సిన వాటా మొత్తం తగ్గుతుంది.

 

  • ఎంప్లాయి కానీ ఎంప్లాయర్ కానీ మేం గతంలో చెల్లించినట్టే 12 శాతం చెల్లిస్తామన్నా కూడా ఈపీఎఫ్‌ఓ అంగీకరిస్తుంది.

 

  • ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్ రేటును 12 శాతం నుంచి 10 శాతానికి తగ్గించినప్పటికీ పెన్షన్ మొత్తంపై ఎటువంటి ప్రభావం ఉండదు. ఎందుకంటే ఈపీఎస్‌ కంట్రిబ్యూషన్ లో ఎటువంటి మార్పూ చేయలేదు. అది గతంలో ఉన్నట్టే 8.33 శాతంగా ఉంది. దీని వలన పెన్షన్ కోసం ఉద్దేశించిన మొత్తం భద్రంగా ఉంటుంది.

 

సో..మీ ఈ 3 నెలలూ మీ నెట్ శాలరీ కాస్త ఎక్కువ వస్తే కన్‌ఫ్యూజ్ కాకండి. ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్ తగ్గడం వలన మీ నెట్ శాలరీ పెరిగినట్టు. పరిస్థితిలో మళ్లీ నార్మల్ కి చేరుకుంటే జూలై నుంచి మీ ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్ ఎప్పటిలానే మీ బేసిక్ శాలరీపై 12 శాతం డిడక్ట్ అవుతుంది.

వెల్త్ సెంటర్ టీం