ఈ అబ్రహాం గారికి సడెన్‌ గా మతం గుర్తుకొచ్చింది!!

 

ఈ మధ్య మేధావులం అని చెప్పుకు తిరుగుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. దేశంలో సెక్యులరిజం లేదని, మతం ప్రాతిపదికన వివక్ష పెరిగిపోయిందని, ప్రజలకు అన్యాయం జరిగిపోతోందని ఎంత గట్టిగా గొంతు చించుకుంటే అంత పెద్ద మేధావులు అయిపోయినట్టు. కమల్‌హాసన్ దగ్గర్నుంచి, నసీరుద్దీన్ షా, అమీర్ ఖాన్ ఇలా దేశంలో ఏదో జరిగిపోతోందని, కనిపించిన వాళ్లని కనిపించినట్టు దాడి చేసి కొట్టేస్తున్నారని నానా యాగీ చేసే సినీ మేధావులు చాలా మందే ఉన్నారు. ఇప్పుడు వీళ్ల జాబితాలోకి మరో మేధావి వచ్చి చేరిపోయాడు. అతనే మన కండల వీరుడు జాన్ అబ్రహాం.

ఈ మధ్య కేరళ వెళ్లిన జాన్ అబ్రహాంకు హఠాత్తుగా దేశంలో అసహనం పెరిగిపోతోందని మతం ప్రాతిపదికన విభిజిస్తున్నారని ప్రజలకు అన్యాయం జరిగిపోతోందని స్టార్ హోటల్ లో మంచి నాణ్యమైన లిక్కర్ తీసుకున్నాక అర్ధమైంది. వెంటనే మరుసటి రోజు అసలు దేశంలో స్వేచ్ఛ లేదని మాట్లాడనివ్వడం కూడా లేదంటూ మీడియా ముందు అనర్గళంగా ఉపాన్యాసం ఇచ్చాడు. అనుభవించాల్సినంతా స్వేచ్ఛ, స్టార్ హోదా ఎంజాయ్ చేసాక వీళ్లకి సడెన్ గా మతం, స్వేచ్ఛ ఎందుకు గుర్తుకు వస్తాయో అంతు లేలని ప్రశ్న.

120 కోట్ల మంది ఉన్న జనాభాలో వీళ్ల మతం ఆధారంగా సినిమాలు చూస్తేనే వీళ్లు స్టార్లు అయ్యారా? ప్రజల మధ్య విధ్వేషాలు రెచ్చగొడుతూ ఎదో జరిగిపోతోందన్న భావనను కలిగించే వీళ్లకు మాట్లాడే స్వేచ్ఛ లేదా?? స్వేచ్ఛ లేకుంగా ఇంతటి భాధ్యాతారాహిత్యంగా వీళ్లు ఎలా మాట్లాడగలుగుతున్నారు? పైపైచ్చు సదరు కండల హీరో గారు దేశంలో ఉన్న ప్రజలంతా ఉత్త పనికిమాలిన వాళ్లు అన్న అర్ధం వచ్చేలా మరో కామెంట్ చేసాడు. కేరళలో బీజేపీ గెలవలేకపోవడాన్ని ఎత్తి చూపుతూ ఒక్క కేరళలో మాత్రమే ప్రజలు విజ్ఝతతో ఉన్నారని నోరు పారేసుకున్నాడు. అంటే మిగిలిన రాష్ట్రాల్లో ఉన్న ప్రజలంతా మూర్ఖులు అని అర్ధం వచ్చేలా మాట్లాడాడు. నైట్ క్లబ్బుల్లో విదేశీ మద్యం తాగుతూ, అప్పుడప్పుడు ఇలా బయటకు వస్తూ సమాజంపై బాధ్యత లేకుండా ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడే ఇలాంటి సెలబ్రెటీలు మనకు అవసరమా?? కొసమెరుపు ఏంటంటే…ఫిడెల్ కాస్ట్రో చనిపోయినప్పుడు ఒక్క కేరళలోనే ఫ్లెక్సీలు పెట్టారంట..మిగతా దేశమంతా ఆయన ఫ్లెక్లీలు పెట్టలేదని తెగ ఫీలైపోయాడు. బాబూ అబ్రహాం…. మన దేశంలో వీరులకు, దేశభక్తులకు కొదువ లేదు. ఫ్లెక్సీలు పెడితే గిడితే మన వీరుల ఫ్లెక్సీలే పెట్టుకుంటాం. పక్క దేశాలకు వెళ్లి వీరులను దిగుమతి చేసుకోవాల్సిన అగత్యం ఇంకా భారతదేశానికి రాలేదు.

Mr.K