వైజాగ్‌ లో పురుష హక్కుల పరిరక్షణకు ప్రత్యేక వేదిక

సమాజంలో ఇప్పుడు పురుషులు ఎదుర్కొంటున్న సమస్యలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా కుటుంబ కలహాలు, వ్యతిరేక చట్టాలు పురుషులను మానసికంగా కుంగదీస్తున్నాయి. ముఖ‌్యంగా భార్యలు పెట్టే తప్పుడు కేసులతో కుంగిపోయి దేశవ్యాప్తంగా వేలాది మంది పురుషులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నిజమైన బాధిత మహిళల కోసం రూపొందించిన చట్టాలను కొందరు తప్పుడు మార్గంలో ఉపయోగిస్తూ పురుషులను దెబ్బతీసే లీగల్ టెర్రరిజం కు పాల్పడుతున్నారు.

ఇటువంటి దుర్మార్గమైన సందర్భంలో పురుష హక్కుల కోసం, మహిళలకు మాత్రమే రక్షణ కల్పించే చట్టాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది. బాధిత పురుషులకు మానసికంగా మద్ధతు ప్రకటించేందుకు దేశ వ్యాప్తంగా వివిధ నగరాల్లో ప్రత్యేక వేదికలు ఏర్పాటయ్యాయి. అందులో భాగంగానే విశాఖపట్నం లో భారతీయ కుటుంబ వ్యవస్థను కాపాడేందుకు, పురుష హక్కులను పరిరక్షించేందుకు ప్రత్యేకమైన వేదిక ఏర్పాటైంది. తప్పుడు కేసులతో మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పురుషులు ఈ వేదికను ఉపయోగించుకోగలరు.

ప్రతీ ఆదివారం ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి మధ్యహ్నం 12 గంటల 30 నిమిషాల వరకూ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో పురుష హక్కులు, లీగల్ టెర్రరిజం, న్యాయ సహాయం, బాధిత పురుషులకు మానసిక ధైర్యం తదితర విషయాలు చర్చించబడతాయి.

వేదిక : 

వైజాగ్ సెంట్రల్ పార్క్
opp ఆర్‌టీసీ కాంప్లెక్స్
మున్సిపల్ కార్పోరేషన్ ఆఫీస్ దగ్గర (GVMC)
విశాఖపట్నం

ప్రవేశం ఉచితం