మైండ్ స్పేస్ IPO లో ఇన్వెస్ట్ చేయొచ్చా?

 

కరోనా లాక్‌డౌన్ వేళ కనీస స్థాయిలకు దిగజారిన స్టాక్‌మార్కెట్లు గడిచిన ఇటీవలి కాలంలో మంచి జోరు మీదున్నాయి. ముఖ్యంగా ఎంపిక చేసిన రంగాల్లో కొన్ని షేర్లు గరిష్ఠ స్థాయిలకు కూడా చేరుకున్నాయి. ఈ పాజిటివ్ న్యూస్ ను బేస్ చేసుకునే రిస్క్ అనిపించినా కొన్ని కంపెనీలు ఐపీఓకు వచ్చాయి. ఇప్పటికే రోసారి బయోటెక్ షేర్ దాదాపు 70 శాతం ప్రీమియంతో తొలి రోజు మార్కెట్ లో ట్రేడ్ అయ్యి ఇన్వెస్టర్లకు కాసులు కురిపించింది. అలాగే యెస్‌ బ్యాంక్ ఎఫ్‌పీఓ కూడా ఫర్వాలేదనిపించింది. ఇప్పుడు ఇదే ఉత్సాహంతో ప్రముఖ కార్పోరేట్ ఆఫీస్ స్పేస్ లీజింగ్ కంపెనీ మైండ్ స్పేస్, ఐపీఓ జూలై 27 నుంచి ప్రైమరీ మార్కెట్లోకి వస్తోంది.

మైండ్ స్పేస్‌ బిజినెస్ పార్క్స్

ఇండియాలో క్వాలిటీ ఆఫీస్ లీజింగ్ సంస్థగా మైండ్ స్పేస్ బిజినెస్ పార్క్స్ REIT( Real Estate Investment Trusts) కు మంచి పేరుంది. ముంబై తో పాటు హైదరాబాద్, పుణె, చెన్నైలలో వీరికి ఆఫీస్ స్పేసెస్ ఉన్నాయి. మొత్తం అన్ని సిటీలలో కలిపి మైండ్‌ స్పేస్ కు 29.5 మిలియన్ స్క్వేర్ ఫీట్ వైశాల్యం కలిసిన ఆఫీస్ స్పేస్ పోర్ట్‌ఫోలియో ఉంది. వీళ్ల టెనెంట్స్ బేస్‌ లో ఇండియన్ కంపెనీస్ తో పాటు అసెంచర్, జేపీ మోర్గాన్, అమెజాన్, కాప్‌ జెమిని, బార్‌క్లేస్ వంటి మల్టీ నేషనల్ కంపెనీలు కూడా ఉన్నాయి.

ఇష్యూ తేదీలు : 27 జూలై 2020 నుంచి 29 జూలై 2020
ఇష్యూ ధర : రూ. 274 – రూ.275
లాట్ సైజ్ : 200 షేర్లు
ఇష్యూ సైజ్ : రూ.4500 కోట్లు

కంపెనీ సానుకూలతలు

వీళ్ల పోర్టిఫోలియోలో 5 ఇంటిగ్రేటెడ్ బిజినెస్ పార్క్ లు ఉన్నాయి. వీటిలో మైండ్‌ స్పేస్ మాధాపూర్, మైండ్ స్పేస్ ఎయిరోలి లు పెద్దవి. 31 మార్చి 2020 నాటికి కంపెనీ పోర్ట్‌ఫోలియోలో 172 టెనెంట్స్ ఉన్నారు. ఇందులో యావరేజీ లీజ్ కాలం 5.8 సంవత్సరాలుగా ఉంది. అలాగే మొత్తం పోర్ట్‌ఫోలియోలో 92 శాతం ఆక్యుపెన్సీ ఉంది. ఇండియా వృద్ధి రేటు లో రానున్న రోజుల్లో సేవల రంగం ప్రధాన పాత్ర పోషించనున్న నేపథ్యంలో వీరి బిజినెస్ మోడల్ పై మంచి అంచనాలే ఉన్నాయి.

కంపెనీ ప్రతికూలతలు

  • దేశంలో కమర్షియల్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఏమైనా ఒడిదుడుకులు ఏర్పడితే అవి కంపెనీ లాభదాయకతను దెబ్బతీయొచ్చు.
  • వీరి ఆదాయంలో అధిక శాతం కొన్ని పెద్ద కంపెనీల నుంచే వస్తోంది. ఆ కంపెనీల బిజినెస్ లలో మార్పులు జరిగితే అది మైండ్ స్పేస్ కు ప్రతికూలంగా మారొచ్చు.
  • ప్రస్తుత COVID -19 మహమ్మారి నేపథ్యంలో కమర్షియల్ రియల్ ఎస్టేట్ కు కొన్ని ఎదురు దెబ్బలు తగలవచ్చన్న బలమైన అంచనాలున్నాయి.

( మీ పైనాన్సియల్ అడ్వైజర్ తో చర్చించి మైండ్ స్పేస్ లో పెట్టుబడులు పెట్టాలా? వద్దా? అన్నదానిపై తగిన నిర్ణయం తీసుకోండి )

వెల్త్ సెంటర్ టీం
www.wealthcenter.in
733 099 6656