సెబీ కొత్త నిర్ణయాలు తెలుసా?

 

దేశంలో ఈక్విటీ మార్కెట్లతో పాటు కమోడిటీ మార్కెట్లను అభివృద్ధి చేసేందుకు స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ, సెబీ తాజాగా కొన్ని కీలక నిర్ణయాలు ప్రకటిచింది. సెబీ తాజా నిర్ణయాల వలన కమోడిటీ డెరివేటివ్స్ లో ఇక నుంచి ఆప్షన్ల కొనుగోలు, అమ్మకాలు జరపొచ్చు. అదే విధంగా మ్యూచువల్ ఫండ్ కొనుగోళ్లను పెంచేందుకు డిజిటల్ వ్యాలెట్ల నుంచి కూడా ఫండ్స్ లో పెట్టుబడి పెట్టేందుకు కూడా సెబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

సెబీ నిర్ణయాల్లో కొన్ని…

  • కమోడిటీ మార్కెట్లలో ట్రేడింగ్ పరిమాణాన్ని పెంచేందుకు ఆప్షన్ల ట్రేడింగ్ కు అనుమతి
  • సెక్యూరిటీస్ కాంట్రాక్ట్ రెగ్యులేషన్ 2012 సవరించే ప్రతిపాదనకు ఆమోదం
  • ఇన్వెస్టర్లు స్మార్ట్‌ఫోన్ లలోని డిజిటల్ వ్యాలెట్ల ద్వారా మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో పెట్టుబడులు పెట్టొచ్చు
    క్రెడిట్ కార్డుల ద్వారా వ్యాలెట్లలోకి డబ్బు మళ్లించి చేసే కొనుగోళ్లు చెల్లవు
  • ఇళ్లలో చిన్న చిన్న పొదుపులను కూడా కేపిటల్ మార్కెట్ల వైపు మళ్లించేందు చర్యలు
  • ఐపీఓల్లో అర్హులైన సంస్థాగత ఇన్వెస్టర్ల కోటాలో పెట్టుబడులు పెట్టేందుకు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్సియల్ ఇనిస్టిట్యూట్ లకు అనుమతి
  • ఆర్‌బీఐ వద్ద నమోదై ఉండి రూ.500 కోట్ల నెట్‌వర్త్ కలిగిన ఉన్న నాన్ బ్యాంకింగ్ ఫైనాన్సియల్ ఇనిస్టిట్యూట్ లకు అర్హత