ఈ ఆడోళ్లు ట్రంప్ పదవి ఊడగొట్టేలా ఉన్నారే!


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు మీడియాతో పాటు ఇంకో చిక్కు కూడా వచ్చి పడింది. మీడియాను ఎలాగైనా మేనేజ్ చేయొచ్చు కానీ ఆడోళ్లను మేనేజ్ చేయడం చాలా కష్టమనే విషయం మూడు పెళ్లిళ్లు చేసుకున్న ట్రంప్ మహాశయునికి తెలియంది కాదు. అధ్యక్షుడిగా ఎన్నికైన దగ్గర్నుంచి ఈ ఆడ గోలతో ఎలాగోలా నెట్టుకొస్తున్న ట్రంప్ కు ఇప్పుడు అది తలకు మించిన భారంగా తయారై కూర్చుంది.

మొన్నటికి మొన్న ట్రంప్ పడుచు పెళ్లాం మెలానియా అతన్ని పెద్ద చిక్కుల్లో పడేసింది. విదేశీ పర్యటనలో మెలానియా చేయి పట్టుకుందామని ప్రయత్నించి ఆమె విదిలించి కొట్టడంతో కంగుతిన్నాడు. ఈ వీడియోను ట్రంప్ పై పగబట్టేసిన మీడియా తిప్పి తిప్పి చూపించింది. మెలానియాకు ట్రంప్ కు విభేధాలు ఉన్నాయని త్వరలో వాళ్లిద్దరూ విడిపోవచ్చని ఛానెళ్లు కథనాలు వండి వార్చాయి. ఇదేదో సద్దుమణిగింది అనుకునే లోపే పోలెండ్ పర్యటనలో ఆ దేశ అధ్యక్షుని భార్య షాక్ ఇచ్చింది. ఆమెకు షేక్ హ్యాండ్ ఇద్దామని ఆశతో చేయి చాపిన ట్రంప్ కు ఆమె చుక్కలు చూపించింది. కనీసం చేయి కాదు కదా అతని వంక కూడా చూడకుండా పక్కకు వెళ్లిపోయింది. దీంతో ట్రంప్ మొహం నల్లగా మాడిపోయింది. ఇదో ఘోర అవమానం.

ఈ ఇద్దరు ఆడాళ్లతో తిన్న దెబ్బలకు ఆయింట్‌మెంట్ రాసుకుంటున్న సమయంలో కూతురు రూపంలో ట్రంప్ కు మరో ఆడ గండం వచ్చి పడింది. తాజాగా జీ 20 సదస్సులో పాల్గొంటున్న అమెరికా అధ్యక్షుల వారికి కూతురు ఇవాంకా కూడా షాక్ ఇచ్చింది. ట్రంప్ తో పాటు ఈ సదస్సుకు వచ్చిన ఇవాంకా కుదురుగా కూర్చొకుండా అక్కడ చేస్తున్న అతిని అమెరికా మీడియా ఇప్పడు ఎండబెడుతోంది. ట్రంప్ కూర్చోవాల్సిన ప్లేస్ ప్రపంచ నాయకుల మధ్య ఇవాంకా కూర్చోవడం ఆ సమయంలో ట్రంప్ లేకపోవడం ట్రంప్ బంధుప్రీతికి పెద్ద నిదర్శనమని అమెరికాలో కలకలం సృష్టిస్తున్నారు. మొత్తానికి వరుసగా ఆడోళ్లు ఇస్తున్న షాక్ లతో మన ట్రంప్ మహాశయుడు అడ్రస్ లేకుండా పోయేలా ఉన్నాడు.