డిగ్గీ రాజా మళ్లీ ఏసేసాడు!


ఆధారాలు లేకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడే నేతలకు ఏమైనా ప్రైజ్ లు ఇస్తే అందులో ఫస్ట్ ప్రైజ్ అందుకునేది కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ మాత్రమే. ఇష్టానుసారంగా అడ్డదిడ్డంగా మాట్లాడటంతో అతను పీహెచ్‌డీ చేసాడు. గతంలో ఇలానే చాలాసార్లు మాట్లాడి బోలెడు అప్రతిష్ఠను మూటగట్టుకున్న ఈ మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు మరోసారి టీఆర్ఎస్ ప్రభుత్వంపై పడ్డాడు.

తెలంగాణాలో భారీ డ్రగ్స్ కుంభకోణం వెలుగు చూసింది. అందులో టీఆర్ఎస్ నేతలు చాలామంది ఉన్నారు అంటూ ట్విట్టర్ వేదికగా వీరలెవెల్లో రెచ్చిపోయాడు. ఇతగాడి మాటలు తెలిసిన వాళ్లు మాత్రం ఈ విషయంలో ఇతన్ని లైట్ తీసుకుంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు మాత్రం నోరు మెదపలేదు. ఏదైనా కుంభకోణమో, లేక మరేదైనా బయటపడిన వెంటనే వెనుకా ముందూ చూడకుండా ప్రభుత్వంపై ఆధారాలు లేకుండా విమర్శలు చేస్తే ఏలా అన్నది ఈయన మర్చిపోయినట్టున్నాడు.

ఆధారాలు లేకుండా చేసే విమర్శల వలన తెలంగాణాలో అంతంతమాత్రంగా ఉన్న కాంగ్రెస్ ప్రతిష్ఠ మరింత మంట గలుస్తుందని ఈయనగారికి తెలియదా అని కొందరు కాంగ్రెస్ నాయకులు చెవులు కొరుక్కుంటున్నారు. ఇప్పటికే గోవాలో కాంగ్రెస్ అధికారం నుంచి దూరం కావడానికి కారణమైన డిగ్గీరాజా కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటే మంచిదని కొందరు కాంగ్రెస్ నాయకులే విమర్శిస్తున్నారు. మరి దిగ్విజయ్ సింగ్ విశ్రాంతి తీసుకుంటారో లేక ప్రత్యర్ధి పార్టీలకు మేలు చేసి కాంగ్రెస్ పార్టీని మరింత దిగజార్చుతారో వేచిచూడాలి.