నీతా అంబానీ ఫోన్ ఖరీదు రూ.315 కోట్లు!!

ఇండియాలోనే నెంబర్‌వన్ ధనవంతుడు ముకేష్ అంబానీకి సంబంధించి వచ్చే ఏ న్యూస్ అయినా ఇటీవలి కాలంలో సంచలనంగా మారుతోంది. ముంబయ్ లో ముకేష్ నిర్మించిన భవనం అయినా, ఆయన తన సెక్యూరిటీకి వాడే వ్యవస్థ కానీ హాట్ టాపిక్ గా మారాయి. ఈ నేపథ్యంలో రీసెంట్ గా ముకేష్ అంబానీ భార్య నీతా అంబానీ వాడుతున్న ఫోన్ ఖరీదు అక్షరాలా రూ.315 కోట్లు అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారింది.

ఆపిల్ కంపెనీ ప్రత్యేకంగా నీతా అంబానీ కోసం ఐఫోన్ 6 ను డిజైన్ చేసిందని, ఈ ఫోన్ ను 24 క్యారెట్ బంగారంతో పాటు కింద పడినా బ్రేక్ అవకుండా ప్లాటినం ఉపయోగించారంటూ ఏవేవో వార్తలు వచ్చాయి. అయితే పూర్తిగా అవాస్తమని రిలయన్స్ వర్గాలు ఖండించాయి. అసలు అంత మొత్తం పెట్టి ఫోన్ ను ఎవరైనా డిజైన్ చేయించుకుంటారా అంటూ వాళ్లు తిరిగి ప్రశ్నలు సంధించారు. మొత్తానికి ఫోన్ వ్యవహారంతో నీతా అంబానీ మాత్రం సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యారు.