ఎన్టీఆర్ ఇమేజ్ కి బిగ్ హోల్ పడేలా ఉంది!


టెప్టింగ్ రెమ్యూనరేషన్ కు ఆశపడ్డ జూనియర్ఎన్టీఆర్, బిగ్ బాస్ విషయంలో ఇప్పుడు బాధపడుతున్నాడట. మూడు రోజులు తిరిగేసరికే బిగ్ బాస్ షో తుస్సు మని పోవడంతో ఎన్టీఆర్ షో నిర్వాహకులపై అసంతృప్తిగా ఉన్నాడని టాక్. అసలు కాంట్రవర్సీలు లేకుండా బిగ్ బాస్ షో ఇప్పటివరకూ ఎక్కడా హిట్ అయిన దాఖలాలు లేవు. తెలుగులో మాత్రం ఎటువంటి కాంట్రవర్సీలు లేకుండా ఈ షోని లాగిద్దామంటే ఎలా కుదురుతుంది?

బిగ్ బాస్ హోస్ట్ గా ఎన్టీఆర్ ఫర్వాలేదనిపించినా పార్టిసిపెంట్స్ మాత్రం షోను చప్పగా చేస్తూ వీక్షకులకు బోర్ కొట్టిస్తున్నారు. గడిచిన నాలుగురోజుల ఫీడ్ బ్యాక్ చాలా వరస్ట్ గా ఉన్నట్టు తేలిపోయింది. దీంతో ఇప్పుడు ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేస్తే కానీ ఈ షో నడిచేలాలేదు. ఆ విష‍యంపై స్క్రిప్ట్ రైటర్ లు కసరత్తులు చేస్తున్నారట.

అలా అని మరీ మితిమీరి కాంట్రావర్సీలకు క్రియేట్ చేస్తే ఎన్టీఆర్ ఇమేజ్ కు డ్యామేజ్ తప్పదు. ఎన్టీఆర్ ఇమేజ్ దెబ్బతినకుండా అదే సమయంలో టీఆర్పీ పడిపోకుండా ఏం చేయాలా అని స్టార్ మా యాజమాన్యం తలలు పట్టుకోంటోందట. మరోవైపు ఈ షోని ఆసక్తికరంగా మార్చండి లేకుంటే అనవసరంగా నా ఇమేజ్ కు నష్టం వస్తుందని ఎన్టీఆర్ వాళ్లకు క్లియర్ చేసారని ఆయన సన్నిహితులు చెపుతున్నారు.