మళ్లీ పవన్ కళ్యాణ్‌ పై పడ్డ రోజా!


ఏదో ఒకరోజు ప్రెస్‌మీట్ పెట్టడం అందులో హోల్‌సేల్ అందరు నాయకులను వరుసపెట్టి తిట్టేయడం ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే రోజా సరికొత్త స్టైల్. ఈరోజు ప్రెస్‌మీట్ పెట్టిన రోజా చంద్రబాబుతో స్టార్ట్ చేసి నారాయణ, అచ్చెన్నాయడు అందర్నీ చీల్చి చెండాడింది. ఇక పనిలో పనిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కూడా కొన్ని పంచ్ లు వేసింది.

కాటమ రాయుడు సినిమా రిలీజ్ టైం లో నేనే పెద్ద కాటన్ రాయడ్ని , నేనే చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ ను అంటూ తెగ ప్రచారం చేసుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు చేనేత సమస్యలపై నోరు మెదపడం లేదని రోజా విమర్శించారు. సమస్యలపై ప్రతీ క్షణం మాట్లాడితేనే నిజమైన నాయకుడు అనిపించుకుంటారంటూ పవన్ కు చురకలు అంటించింది. మరి రోజా తాజా విమర్శలపై పవన్ అభిమానులు , జనసేన నాయకులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.