పాకిస్తాన్ పై దాడి చేస్తానంటున్న ముస్లిం దేశం!

 

ఉగ్రవాదులకు అడ్డాగా మారిన పాకిస్తాన్ ఇప్పట్లో గుణపాఠాలు నేర్చుకునేలా లేదు. సరిహద్దు దేశాలపైకి ఉగ్రవాదులను ఉసికొల్పుతూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్న పాక్ కు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. సరిహద్దులో కవ్వింపు చర్యలను మానుకోకపోతే దాడులు తప్పవని హెచ్చరించింది. పాకిస్తాన్ లో తలదాచుకుంటున్న సున్నీ మిలిటెంట్లు తమ దేశ సరిహద్దుల్లో దాడులకు పాల్పడుతున్నారని, వారిని అరెస్ట్ చేయకుంటే తామే ఆ దేశంలోని వాళ్ల స్థావరాలపై బాంబు దాడులు చేస్తామని ఇరాన్ స్పష్టం చేసింది.

గత కొన్నాళ్లుగా పాక్ లో ఉగ్రవాద శిక్షణ పొందుతున్న సున్నీ మిలిటెంట్లు షియాలు అధికంగా ఉండే ఇరాన్ సరిహద్దుల్లో దాడులను ముమ్మరం చేస్తున్నారు. ఈ దాడుల్లో ఇప్పటికే కొందరు ఇరాన్ సైనికులు చనిపోయారు. దీంతో అగ్గి మీద గుగ్గిలమైన ఇరాన్ పాక్ కు హెచ్చరికలు పంపింది. పాక్ ఉగ్రవాదులను అరెస్ట్ చేసి వాళ్లను నిలువరించకపోతే తామే ఆ దేశ భూభాగంలో ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేస్తామని ఇరాన్ ఆర్మీ ఛీప్ గట్టి సంకేతాలు పంపారు.