దుమ్ము రేపుతున్న స్టార్ హీరో టీజర్!

కోలీవుడ్ లో హీరో అజిత్ కు ఉన్న క్రేజే వేరు. ఆయన సినిమా అంటే అభిమానులకు పండగే. అజిత్ లేటేస్ట్ మూవీ ‘వివేగం’ టీజర్ రీసెంట్ గా రిలీజైంది. శివ దర్శకత్వంలో వస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీని అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. అజిత్ కు జోడీగా కాజల్ అగర్వాల్, అక్షర హాసన్ జతకట్టిన ఈ మూవీ టీజర్ ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. రిలీజ్ అయిన పది గంటల్లోనే రెండు మిలియన్ వ్యూస్ సాధించి రికార్డు దిశగా దూసుకుపోతుంది. ఈ సూపర్ టీజర్ పై మీరూ ఓ లుక్కేయండి.